లండన్ : ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో అతను శ్రీలకంతో జరిగిన వార్మప్ మ్యాచ్ ఆడలేదు. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో గురువారం వార్నర్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించగా.. అతను అన్‌ఫిట్ అని తేలినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్‌తో రేపు(శనివారం) జరిగే ఆరంభమ్యాచ్‌కు వార్నర్ దూరమయ్యే అవకాశం ఉంది. వార్నర్ కుడితొంటిలో గాయమైందని, దాని నొప్పి కారణంగా వార్నర్ ఇబ్బంది పడుతున్నాడని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ మీడియాకు తెలిపాడు. వార్నర్ టోర్నీలో 15 మంది ఆటగాళ్లకు అవకాశం రావాలని కోరుకుంటాడని జస్టిన్ చెప్పుకొచ్చాడు. అతని గాయంతో ఎలా ముందుకు వెళ్లాలో వ్యూహాలు రచిస్తున్నామని తెలిపాడు.
అయితే వార్నర్ త్వరగా కోలుకోకపోతే తుది జట్టు ఎంపిక ఆసీస్ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఓ పెద్ద తలనొప్పిగా మారనుంది. శ్రీలంకతో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో వార్నర్ గైర్హాజరితో ఉస్మాన్ ఖవాజా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. బాల్‌ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్న వార్నర్.. ఐపీఎల్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. శనివారం అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలనుకున్న వార్నర్‌కు నిరాశే ఎదురైంది. వార్నర్ గాయం నుంచి కోలుకోకపోతే ఆసీస్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment