వార్నర్‌కు మరో శుభవార్త | David Warner And Candice Welcome Their Third Daughter | Sakshi
Sakshi News home page

వార్నర్‌కు మరో శుభవార్త

Published Mon, Jul 1 2019 7:35 PM | Last Updated on Mon, Jul 1 2019 7:35 PM

David Warner And Candice Welcome Their Third Daughter - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు మరింత జోష్‌ కలిగించే వార్త. అతడి భార్య క్యాండీస్‌ ఆదివారం అర్దరాత్రి దాటాక లండన్‌లోని ఓ ఆసుపత్రిలో మూడో బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ తెలుపుతూ.. ఓ ఫోటోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్‌ చేశాడు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు వార్నర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక ఆ పాపకు వార్నర్‌ దంపతులు అప్పుడే ఇస్లా రోజ్‌ అని నామకరణం కూడా చేశారు. ఇక వీరిద్దరికి ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నెల‌లు నిండి, పురుడు పోసుకోవ‌డానికి తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో కింద‌టి వార‌మే డేవిడ్ వార్న‌ర్ త‌న భార్య‌, ఇద్ద‌రు కుమార్తెల‌ను లండ‌న్‌కు పిలిపించుకున్నారు. దీనికోసం ఆయ‌న క్రికెట్ ఆస్ట్రేలియా అనుమ‌తి తీసుకున్నారు. కొంత‌కాలంగా క్యాండిస్ వార్న‌ర్‌, పిల్ల‌లు లండ‌న్‌లో ఉంటున్నారు.
ఇక తన భార్య డెలివరీ గురించి గత వారం వార్నర్‌ ఉద్వేగంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘నిషేధ సమయంలో నా భార్య క్యాండిస్‌కు రెండుసార్లు అబార్షన్ అయ్యింది. ఇప్పటికే నా ఒడిలో మరో బిడ్డ ఉండాల్సింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి కాబోతున్నా. ప్రస్తుతం నా ధ్యాసంతా క్రికెట్‌పైనే. మాకు ఇద్దరు ఆరోగ్యకరమైన పిల్లలు ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆదివారం మా కుటుంబంలోకి మరొకరు రావచ్చు. ఆ శుభగడియల కోసం ఎదురుచూస్తున్నా’ అని వార్నర్‌ తెలిపిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement