మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రపంచ కప్-2019 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండలో జరిగే ప్రపంచకప్, ఆ తర్వాత యాషెస్ సిరీస్ కోసం ఆసీస్ జట్టు సిద్ధమవుతోంది. ఇందుకోసం త్వరలోనే ఇంగ్లండ్‌కు పయనం కానుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టోర్నీలు ఇంకా మొదలు కాకముందే ఇంగ్లండ్ జట్టు అభిమానులు.. ఆసీస్ ఆటగాళ్లే లక్ష్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు ఆటకు దూరమైన డెవిడ్ వార్నర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అక్కసు వెళ్లగక్కుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్యాండ్‌పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌ను గుర్తు చేస్తూ... ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్, లియాన్ నాథన్‌లు చేతిలో బంతితో పాటు సాండ్ పేపర్ కూడా పట్టుకున్నట్లు ఫొటో షాప్ చేశారు. అంతేగాక ట్యాంపరింగ్‌కు మూలకారకుడిగా భావించిన డేవిడ్ వార్నర్ జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా చీట్స్ అనే పేరు ముద్రించినట్లు పొట్రేట్స్ సృష్టిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, విమర్శలకు తన టీమ్ భయపడదని పేర్కొన్నాడు. అన్నింటికీ ఆటతో సమాధానం చెబుతామని వ్యాఖ్యానించాడు. ‘ త్వరలోనే ఇంగ్లండ్‌కు పయనమవుతున్నాం. వరల్డ్ కప్ కంటే కూడా యాషెస్ మొదలైన తర్వాతే ఇలాంటి కామెంట్లు మరెన్నో వినాల్సి వస్తుంది. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ ఆసీస్ తుది జట్టు:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్‌వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్‌స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారె(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నీల్, రిచర్డ్సన్, జాసన్ బెహండ్రాఫ్, ఆడమ్ జంపా.
😍 @cricketcomau release their #CWC19 player portraits! pic.twitter.com/J1wBV5tK5w
— England's Barmy Army (@TheBarmyArmy) May 8, 2019
Comments
Please login to add a commentAdd a comment