
లండన్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొట్టిన బంతికి నెట్ బౌలర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వార్నర్ కొట్టిన బంతికి భారత సంతతికి చెందిన బ‍్రిటీష్ ఫాస్ట్ బౌలర్(నెట్ బౌలర్) జే కిషన్ ప్లాహా తలకు బలంగా తగిలింది. దీంతో ఆ బౌలర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో వెంటనే కిషన్‌కు ఆస్ట్రేలియా సహాయక బృందంతో పాటు మైదానం సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి మెరుగైన చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం కిషన్ బాగానే ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. నెట్స్‌లో జరిగిన ఘటనతో ఆసీస్ జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ భయాందోళనకు గురయ్యాడట. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ స్పష్టం చేశాడు. ‘జే కిషన్‌కు గాయం కావడంతోనే అంతా తీవ్ర ఆందోళనకు లోనయ్యాం. వార్నర్ అయితే చాలా భయపడిపోయాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందనే సమాచారం మా జట్టును కుదుట పరిచింది’ అని ఫించ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment