![ధోనీ ఏ కలర్ జెర్సీలో...](/styles/webp/s3/article_images/2017/09/3/51445661515_625x300.jpg.webp?itok=_uLa3fvK)
ధోనీ ఏ కలర్ జెర్సీలో...
ఐపీఎల్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపైనే ప్రస్తుతం క్రీడావర్గాలతో పాటు ధోనీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఉన్న స్టార్డమ్ ఒక్క ధోనీకే - ఉంది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం... ధోనీని రూ. 7.5 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అప్పటినుండి జరిగిన ఎనిమిది సీజన్లలోనూ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా సేవలందించారు. మరి రాబోయే సీజన్లో ఈ అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ వేలంలో నిలుస్తాడా? మరో జట్టుతో చేరబోతున్నాడా? అనే ప్రశ్నలకు అవుననే సంకేతాలే కన్పిస్తున్నాయి.
రాబోయే ఐపీఎల్ సీజన్లో ధోనీని పసుపురంగు జెర్సీలో కాకుండా వేరే రంగు జెర్సీలో చూడబోతున్నారనడానికి సంకేతాలు వెలువడుతున్నాయి. బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్, టీ-ట్వంటీలో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా పేరున్న ధోనీని దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు.
దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ముంబైలో జరగనుంది. ధోనీ ముంబైకి వెళ్తూ శుక్రవారం చెన్నైలో శ్రీనివాసన్ను కలిశారు. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్ ఐపీఎల్ కార్యాచరణపై క్రీడావర్గాలలో చర్చకు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్పై నిషేధం ఉన్నందున రెండేళ్ల పాటు ధోనీని నిరీక్షించమని ఫ్రాంచైజీ కోరదు .ధోనీ వేలంలో పాల్గొంటాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్లో అభిమానులు ధోనీని పసుపు రంగులో కాకుండా వేరే రంగు జర్సీలో చూడనున్నారు.