ఇటీవలి కాలంలో అధ్భుత ఫామ్ తో దూసుకుపోతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ తన లోని మానవత్వాన్ని చాటుకున్నాడు.
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అధ్భుత ఫామ్ తో దూసుకుపోతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ తన లోని మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇటీవల పుణెలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డాక్టర్ అపర్ణా దేశ్ ముఖ్ వృద్దాశ్రమాన్ని సందర్శించిన విరాట్ తన మ్యాచ్ ఒక రోజు సంపాదనలో 50 శాతం విరాళంగా ఇచ్చాడనీ, అంతే కాకుండా విరాట్ కోహ్లి ఫౌండేషన్ ద్వారా ఈ యేడాది చివరికల్లా అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ కూడా ఇచ్చాడని ఒక పత్రిక పేర్కొంది. నిరుపేద విద్యార్థులకు చేయూతనందించడం కోసం శుక్రవారం స్లైలు ఫౌండేషన్ నిర్వహించిన చారిటీ కార్యక్రమానికి విరాట్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇలా విరాట్ సమాజంలోని సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ తన వంతు సహాయం చేస్తుండడం అభినందనీయం.