కోల్‌కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లోనూ వైఫల్యం చెందడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల బౌలింగ్ ప్రదర్శన చూసి తమ బౌలర్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. ప్రధానంగా తమ పేసర్లు నకుల్ బాల్స్ ఎలా వేయాలో హైదరాబాద్ బౌలర్లను చూసి నేర్చుకోవాలని హితబోధ చేశాడు. అదే సమయంలో స్సిన్నర్లపై కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు.
‘మా స్సిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. మేము నిర్దేశించిన 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 19 ఓవర్‌లో ఛేదించింది. మ్యాచ్‌ను కడవరకూ తీసుకురావడానికి మా స్పిన్నర్లే కారణం. స్పిన్నర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. కాకపోతే మా పేస్ బౌలింగ్ విభాగంలో వైవిధ్యం లేదు. ఒకవైపు హైదరాబాద్ బౌలర్లు నకుల్ బాల్స్‌తో సత్తాచాటితే.. మా సీమర్లు మాత్రం ఆ బంతుల్ని సంధిచడంలో విఫలం చెందారు. నకుల్ బాల్స్ ఎలా వేయాలో సన్‌రైజర్స్ బౌలర్లను చూసి నేర్చుకుంటే బాగుంటుంది’అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment