కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఓటమి చెందడం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. తాజా సీజన్ ఆద్యంతం తాము ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌లో పరాజయం చెందడం ఒకింత నిరాశను మిగిల్చిందన్నాడు. సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి ఆరంభం లభించినప్పటికీ, కొన్ని చెత్త షాట్లతో పాటు ఒక రనౌట్ తమ ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు.
‘ఇది మాకు మంచి టోర‍్నమెంట్. కానీ ఫినిషింగ్ బాలేదు. ఛేజింగ్ చేసే సమయంలో మాకు గొప్ప ఆరంభం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. కొన్ని చెత్త షాట్లు మా కొంప ముంచాయి. నాతోపాటు నితీష్ రాణా, రాబిన్ ఉతప్పలు మ్యాచ్‌ను ముగిస్తే బాగుండేది.. అలా జరగలేదు. దాంతో ఓటమి చూడాల్సి వచ‍్చింది. సన్‌రైజర్స్ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్‌లో యువ క్రికెటర్లు వారికి వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు’ అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment