
బెర్నార్డ్ మృతికి సంతాపం తెలుపుతున్న రీమ్స్ క్లబ్
పారిస్: కరోనా వైరస్ బారిన పడ్డ ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఫ్రెంచ్ ఫుట్‌బాల్‌లో భాగంగా ఓ క్లబ్ జట్టుకు డాక్టర్‌గా ఉన్న బెర్నార్డ్ గోంజ్‌లెజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టైన లిగీ-1 రీమ్స్ డాక్టర్ బెర్నార్డ్ గోంజెలెజ్‌కు కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన అతనికి టెస్టుల్లో కరోనా పాజిటివ్ రావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది ఆ దేశ ఫుట్‌బాల్ రంగాన్ని కలవరపాటుకు గురిచేసింది.
ఇక తాను బ్రతకనని భావించే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని రీమ్స్ మేయర్ అర్మౌడ్ రాబినెట్ అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ బెర్నార్డ్‌కు కరోనా సోకిన విషయం తనకు తెలిసిందని, ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధించిందని రాబినెట్ విచారం వ్యక్తం చేశారు. తనకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న బెర్నార్డ్ మృతి వార్తతో షాక్‌కు గురయ్యానన్నారు.
అతను కేవలం క్లబ్ జట్టుకు డాక్టర్ మాత్రమే కాదని, మా రీమ్స్ క్లబ్‌లో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తన్నారు. చాలా మంచి మనిషిగా పేరున్న బెర్నార్డ్ ఇలా మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నామని రాబినెట్ సానుభూతి తెలియజేశారు. తమ ఫుట్‌బాల్ కుటుంబం ఒక మంచి డాక్టర్‌ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఫ్రాన్స్‌లో విజృంభిస్తుండటంతో ఇప్పటివరకూ ఎనిమిది వేలకు మందికి పైగా మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment