బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆసీస్ విసిరిన 278 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కీలక వికెట్లును చేజార్చుకుంది. ఆరు ఓవర్లలో 35 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లను నష్టపోయింది. జాసన్ రాయ్(4), హేల్స్(0), జో రూట్(15)లు పెవిలియన్ కు చేరారు. ఈ మూడు వికెట్లలో హజల్ వుడ్ కు రెండు, స్టార్క్ కు వికెట్ దక్కింది.
అయితే ఆసీస్ వికెట్ల వేటతో బిజీగా ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు వెళ్లాలంటే ఆసీస్ కు ఈ మ్యాచ్ లో గెలుపు అనివార్యం. అంతకుముందు ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇదిలా ఉంచితే ఇంగ్లండ్ ముందుగా సెమీస్ కు చేరడంతో ఆసీస్ తో మ్యాచ్ లో ఓటమి ఎదురైనా ఆ జట్టుకు ఇబ్బందేమీ ఉండదు.