చివరి వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపు | england won on australia | Sakshi
Sakshi News home page

చివరి వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపు

Published Sun, Jan 28 2018 5:45 PM | Last Updated on Sun, Jan 28 2018 5:45 PM

kurran - Sakshi

ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను గెలిపించిన కుర్రాన్‌

పెర్త్‌: ఇంగ్లాండ్‌ బౌలర్‌ టీకే కుర్రాన్‌ రాణించడంతో చివరిదైన ఐదవ వన్డే మ్యాచ్‌లో  ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్‌ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ జట్టు 12 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చివర్లో ఆస్ట్రేలియా చతికిలపడింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ జట్టు 47.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్‌ అయింది. జాసన్‌ రాయ్‌(49), బెయిర్‌స్టో(44), హేల్స్‌(35), జో రూట్‌(62)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆండ్రూ టైకు ఐదు వికెట్లు దక్కాయి.

అనంతరం 260 పరుగుల లక్ష్యంతో చేధన ప్రారంభిన ఆసీస్‌ ఆచితూచి ఆడింది. 34 ఓవర్లలో 188 పరుగులు చేసిన ఆసీస్‌ లక్ష్యాన్ని చేధిస్తున్నట్లే కనిపించినా చివర్లో తడబడింది. కీలక​ సమయంలో కుర్రాన్‌ 4 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ విజయం ఖాయమైంది. 48.2 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. స్టానిస్‌(87), మాక్స్‌వెల్‌(34), పెయిన్‌(34) రాణించారు. ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర వహించిన కుర్రాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ ఆసాంతం రాణించిన జో రూట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement