
నెల్సన్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన ఇంగ్లండ్.. ఆపై జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. రెండో టీ20లో పరాజయం చవిచూసిన ఇంగ్లండ్.. మూడో టీ20లో కూడా అదే అనుభవాన్ని చవిచూసింది. కాకపోతే గెలిచే మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజార్చుకుంది. మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసి పరాజయం పాలైంది. 15 ఓవర్‌లో 139 పరుగుల వద్ద ఉండగా మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. వరుసగా వికెట్లు కోల్పోయింది.
10 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డేవిడ్ మలాన్(55; 34 బంతుల్లో), జేమ్స్ విన్సే(49; 39 బంతుల్లో)లు ఆకట్టుకున్నారు. ఇయాన్ మోర్గాన్(18), సామ్ బిల్లింగ్స్(1), సామ్ కరాన్(2), లూయిస్ గ్రెగరీ(0)లు విఫలం కావడంతో ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో పరాజయం చెందింది. అంతకముందు న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్(33), గ్రాండ్‌హోమ్(55), రాస్ టేలర్(27), జేమ్స్ నీషమ్(20), సాంత్నార్(15)లు తలో చేయి వేసి న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో న్యూజిలాండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment