వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌కు చెందిన 51 ఏళ్ల గార్త్ స్టిరాట్ జెంటిల్మన్ గేమ్‌లో అంపైర్. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య టీ20కి అతడు నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నాలుగో అంపైర్ గతంలో పోర్న్ స్టార్ ! అతడి చిత్రాలు ఓ మ్యాగజైన్‌లోనూ ప్రచురితమయ్యాయి. అంతేకాదు..స్టీవ్ పార్నెల్ పేరిట నీలి చిత్రాల్లోనూ నటించాడు.ఆ తర్వాత క్రికెట్ అంపైర్‌గా మారాడు. అతనొక పోర్న్‌స్టార్ అనే విషయం న్యూజిలాండ్ క్రికెటర్లకు తెలుసు. ఈ విషయాన్ని తాజాగా ఇంగ్లండ్ ప్లేయర్లకు న్యూజిలాండ్ క్రికెటర్లు తెలిపారు. అంపైర్‌గా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
పదేళ్ల క్రితం న్యూజిలాండ్ గోల్ఫ్ అసోసియేషన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా స్టిరాట్ పని చేశాడు. ఆ సమయంలోనే పోర్న్ స్టార్‌గా పలు చిత్రాల్లో నటించాడు. దీన్ని రహస్యంగా ఉంచాడు. కాగా ఈ విషయం బహిర్గతం కావడంతో పదేళ్ల కిందట అతడు న్యూజిలాండ్ ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి పోగొట్టుకున్నాడు. ఆపై క్రికెట్ అంపైర్‌గా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. పలు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్టిరాట్ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగ్గా, తలో రెండు గెలిచాయి. శుక్రవారం జరిగిన నాల్గో టీ20లో ఇంగ్లండ్ 76 పరుగుల తేడాతో గెలిచింది. ఐదో టీ20 ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. దాంతో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment