అందరి చూపులు అందుకోసమే: కోహ్లి | Everyone wants to see an India-England final | Sakshi
Sakshi News home page

అందరి చూపులు అందుకోసమే: కోహ్లి

Published Tue, Jun 13 2017 4:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

అందరి చూపులు అందుకోసమే: కోహ్లి

అందరి చూపులు అందుకోసమే: కోహ్లి

లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాలతో దిగిన జట్లు భారత్-ఇంగ్లండ్లు. ఇక్కడ భారత్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలో దిగగా, ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పోరుకు సిద్ధమైంది. ఈ రెండు జట్లు సెమీస్ కు చేరిన క్రమంలో ఫైనల్లో కూడా ఆ రెండు జట్లే చేరతాయనేది విశ్లేషకుల అభిప్రాయం. దాంతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఏకీభవించాడు.

 

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లే దాదాపు ఆడే అవకాశం ఉందని కోహ్లి పేర్కొన్నాడు.' ప్రతీ ఒక్కరు భారత్-ఇంగ్లండ్ ల ఫైనల్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లకు సెమీస్ లో కఠినమైన సవాల్ ఎదురైనప్పటికీ, ఫైనల్లో ఇంగ్లండ్ తో పోరుకే అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారన్నాడు. ఫైనల్ పోరులో ఏ జట్లు పోటీ పడతాయన్న ప్రశ్నకు ఓ కార్యక్రమానికి హాజరైన విరాట్ పై విధంగా సమాధానం ఇచ్చాడు. బుధవారం ఇంగ్లండ్-పాక్ ల మధ్య తొలి సెమీస్ జరుగనుండగా, గురువారం భారత్-బంగ్లాదేశ్ ల మధ్య రెండో సెమీస్ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement