లండన్: ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రధాన పాత్ర పోషించాడు. మెగా ఫైట్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 242 లక్ష్య ఛేదనలో స్టోక్స్ అజేయంగా 84 పరుగులు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌లో కూడా స్టోక్స్ ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేశాడు. మరొకవైపు బట్లర్ 7 పరుగులు చేశాడు. కాగా, సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయగా మళ్లీ మ్యాచ్ టై అయ్యింది. అయితే మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విశ్వ విజేతగా అవతరించింది.
అయితే బెన్ స్టోక్స్‌ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్‌గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్‌కప్ ట్వీటర్ అకౌంట్‌లో పేర్కొంది. ఇంతవరకూ బాగానే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో స్టోక్స్ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇది భారత అభిమానులకు కోపం తెప్పించింది. ప్రధానంగా ఈ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. ‘ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో తెలుసా’ అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ సచిన్‌తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్ లెజెండ్, ఎవరు ఎన్ని చేసినా సచిన్ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం’ అంటూ మరొకరూ విమర్శించారు. ‘ ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్ టైమ్ గ్రేట్ అనేది అర్థమవుతుంది కదా’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. అసలు బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదు. ఇలా పోస్ట్ చేసిన వాడ్ని చెప్పుతో కొట్టాలి’ అంటూ మరొక అభిమాని మండిపడ్డాఢు.
Comments
Please login to add a commentAdd a comment