తొలిసారి టాప్-10లో హరికృష్ణ | first time buyers top 10 places in hari krishna | Sakshi
Sakshi News home page

తొలిసారి టాప్-10లో హరికృష్ణ

Published Wed, Sep 28 2016 12:46 AM | Last Updated on Wed, Aug 29 2018 1:16 PM

first time buyers top 10 places in hari krishna

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ చెస్‌లో తెలుగుతేజం పెంటేల హరికృష్ణ అరుదైన ఘనతను సాధించాడు. ‘ఫిడే’ రేటింగ్‌‌సలో తొలిసారి టాప్-10లోకి అడుగు పెట్టాడు. మంగళవారం నాటి లైవ్ రేటింగ్‌‌సలో అతను ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని పదో స్థానానికి చేరాడు. ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ (నార్వే) 2852.9 పాయింట్లుతో అగ్రస్థానంలో ఉండగా... భారత స్టార్ విశ్వనాథన్ ఆనంద్ (2775.7 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. హరికృష్ణ 2765.8 పాయింట్లుతో పదో స్థానంలో ఉన్నాడు.  
 
 తొలి రౌండ్‌లో ఆనంద్‌కు డ్రా
 మాస్కో: తాల్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌ను మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాగా ముగించాడు. మంగళవారం నెదర్లాండ్‌‌సకు చెందిన అనీష్ గిరితో తలపడిన ఆనంద్ ఈ గేమ్‌ను 56వ ఎత్తు వద్ద డ్రాగా ముగించాడు. తొలి రౌండ్‌లో ఇయాన్ నెపోమ్నియాట్చి (రష్యా) ఒక్కడే ఎవ్గెనీ (రష్యా)పై నెగ్గి ఆధిక్యంలో ఉన్నాడు. మిగతా అన్ని గేమ్‌లు డ్రాగానే ముగిశాయి. వచ్చే నెల 6 వరకు జరిగే ఈ టోర్నీలో పది మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement