
ముంబై: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాధవ్,.. ముంబైలోని బ్రీచ్ కాండే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. వచ్చే నెల ఐదో తేదీన 87వ ఒడిలో అడుగుపెట్టనున్న తరుణంలో మాధవ్ ఆప్టే ఇలా కన్నమూయడం కుటుంబ సభ్యుల్ని కలచి వేసింది.1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్‌గా సేవలందించిన మాధవ్ ఆప్టే ఏడు టెస్టులు ఆడారు. ఇందులో వెస్టిండీస్‌పైనే ఐదు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ వంటి అటాకింగ్‌ను ఎదుర్కొని రెండు సెంచరీలు చేశారు.
కాగా, ఈ రెండు సెంచరీలు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మ్యాచ్‌ల్లోనే చేయడం విశేషం. టెస్టుల్లో అత్యధిక ఆయన వ్యక్తిగత స్కోరు 163. ఓవరాల్‌గా 67 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాధవ్ ఆప్టే 3,336 పరుగులు చేశారు. వీటిలో ఆరు సెంచరీలతో పాటు 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక క్రికెట్ క్లబ్ ఆఫ ఇండియా అధ్యక్షునిగా పని చేశారు. ఆటగాళ్ల వయసు విషయంలో కచ్చితమైన నిబంధనల్ని అమలు చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరుఫున 15 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment