న్యూఢిల్లీ : సరిగ్గా ముప్పయ్‌ఆరేళ్ల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై 1983 ప్రపంచకప్ సాధించింది. దిగ్గజ ఆటగాళ్లున్న వెస్టిండీస్ అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత నిలిచి మాంచి జోష్‌లో ఉండగా.. ఫైనల్లో ఆ జట్టును ధీటుగా ఎదుర్కొన్న టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్ల కృషికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఫిదా అయ్యారు. ఫైనల్లో మనదేశం విజయం సాధించిందని తెలియడంతో.. క్రికెట్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించిన (25 జూన్, 1983) మరుసటి రోజున దేశంలో సెలవు దినంగా ప్రకటించారు.
వివిఎన్ రిచర్డ్స్ ఔట్..
లార్డ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు కేవలం 183 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. చేజింగ్‌కు దిగిన విండీస్‌ను భీకర ఫామ్‌లో ఉన్న వివిఎన్ రిచర్డ్స్ గెలుపుదిశగా తీసుకెళ్తున్న తరుణంలో మదన్‌లాల్ అతన్ని ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. కపిల్‌దేవ్, మదన్‌లాల్, అమర్‌నాథ్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ 140 పరుగులకే చాపచుట్టేసింది. భారత శిగన ప్రపంచకప్ చేరింది. స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు రివార్డులిచ్చేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేకపోవడం గమనార్హం. పెద్ద మనసుతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ వారికి ఆపన్నహస్తం అందించారు. మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా వచ్చిన రెండు లక్షల రూపాల్ని వారికి రివార్డుగా ఇచ్చి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment