
న్యూఢిల్లీ : జట్టులో చోటు కోల్పోయిన క్రికెటర్లు టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్ట్ (ఫిట్‌నెస్ టెస్ట్)లో పాసవ్వడం తప్పనిసరి. ఈ నిబంధనను బీసీసీఐ తప్పనిసరి చేసిన తర్వాత నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో సంజూ శాంసన్, అంబటి రాయుడు, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు విఫలమైన విషయం తెలిసిందే. కేవలం యో-యో టెస్టునే పరిగణనలోకి తీసుకుని ఆటగాళ్లను పక్కన పెట్టేయడం సరికాదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
తన పెద్ద కూతురు ఆజీన్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తే తాను యో-యో టెస్ట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోందన్నట్లుగా గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క్రికెటర్లు ఫిట్‌నెస్ ప్రాక్టీస్‌లో భాగంగా చేసే కసరత్తులను ఆజీన్ చేయడం వీడియోలో చూడవచ్చు. భవిష్యత్ అథ్లెట్ అని కొందరు కామెంట్ చేయగా, తండ్రికి తగ్గ తనయ అని ఆజీన్ కచ్చితంగా నిరూపించుకోనుందని మరికొందరు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment