మెక్‌గ్రాత్‌ చేతికి  గులాబీ టోపీలు | Glenn McGrath Signed Pink Caps For His Foundation | Sakshi
Sakshi News home page

మెక్‌గ్రాత్‌ చేతికి  గులాబీ టోపీలు

Published Sun, Jan 6 2019 2:58 AM | Last Updated on Sun, Jan 6 2019 2:58 AM

 Glenn McGrath Signed Pink Caps For His Foundation - Sakshi

సిడ్నీ టెస్టు మూడో రోజు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సంతకాలతో కూడిన గులాబీ రంగు టోపీలను దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌కు తిరిగిచ్చారు. రొమ్ము క్యాన్సర్‌తో మృతి చెందిన మెక్‌గ్రాత్‌ భార్య జేన్‌ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు నిధుల సమీకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జనవరిలో నిర్వహించే తొలి టెస్టులో ఆటగాళ్లు ‘పింక్‌’ కలర్‌లోని క్రీడా సామాగ్రితో మైదానంలో దిగుతారు. దీనికోసం భారత కెప్టెన్‌ కోహ్లి సైతం గులాబీ రంగు గ్రిప్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇదే సందర్భంలో మ్యాచ్‌కు ముందురోజు ఇరు జట్ల ఆటగాళ్లకు గులాబీ టోపీలు ఇచ్చారు. వీటినే ఆటగాళ్లు శనివారం తిరిగిచ్చారు. దీనిపై ‘మైదానంలోనే కాదు... బయట కూడా భారత క్రికెట్‌ జట్టు అభిమానం పొందింది. అద్భుతమైన సహకారం’ అంటూ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ ట్వీట్‌ చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement