caps
-
Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికలు ఎన్నికల సీజన్‌ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. పార్టీల ప్రచార సామగ్రి, వాటి అభిమానించే ఓటర్లు ధరించే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాయి. దాంతో ఎన్ని‘కళ’ ఈ వేదికలనూ చేరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో పారీ్టల రంగులతో కూడిన టీ షర్టులు, క్యాప్‌లను విక్రయిస్తున్నాయి. ‘నమో హ్యాట్రిక్’, ‘రాహుల్ ఈజ్ హోప్’ (రాహులే ఆశాకిరణం) వంటి సందేశాలతో కూడిన టీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘సుమారు 12 మంది విక్రేతలు ఈ కామర్స్ వేదికలపై ఎన్నికల సామగ్రి అమ్మకాలకు నమోదు చేసుకున్నారు. ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ మరింతమంది ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వెల్లడించారు. స్వతంత్ర రిటైలర్లు, బ్రాండ్ లైసెన్స్ తీసుకున్న కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో యువ ఓటర్లను ఆకర్షించేలా అమ్మకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఖరీదైన వ్రస్తాలు, కీ చైన్లు, కార్లు, ఇళ్లలో పెట్టుకోగలిగిన జెండాలు, ల్యాంపులు, క్లాక్‌ల వంటివి వీటిలో ఉన్నాయి. బ్లాక్ వైట్ ఆరెంజ్ కంపెనీ ‘హౌ టు బి యాన్ ఇన్ఫ్లుయెన్సర్’, ‘ఐ వాంట్ టు వోట్ ఫర్ ఇండియా’ వంటి సందేశాలతో ‘ఏ47’ బ్రాండ్‌పై ఖరీదైన వ్రస్తాలను విక్రయిస్తోంది. అమెరికాలో ఎన్నికల సామగ్రి మార్కెట్ చాలా పెద్దది. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని బ్లాక్‌వైట్ వ్యవస్థాపకుడు భవిక్ వోరా తెలిపారు. బీజేపీ ఇప్పటికే నమో యాప్‌పై టీ షర్ట్లు, మగ్లు, స్టేషనరీని విక్రయిస్తుండడం తెలిసిందే. -
మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 73,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 22,453 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 73,744 వద్ద కనిష్టాన్ని, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 22,388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. ఆఖరి గంటలో కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్, మెటల్, యుటిలిటీ, కమోడిటీ రంగాలకు చెందిన మధ్య, తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత తగ్గాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, 1.14% చొప్పున పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రిటైల్ విభా గాన్ని విభజిస్తుందన్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 12% లాభపడి రూ.236 వద్ద ముగిసింది. -
ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు. The culmination of the event was celebrated today on occasion of the AFWWA Day & was attended by Hon'ble RM Shri @rajnathsingh & Hon'ble Smt @smritiirani. A world record was set, as recognised by Guiness World Records,when the caps were put on display at the location.@GWR pic.twitter.com/cuicVVJKuJ — Indian Air Force (@IAF_MCC) October 15, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్‌బుక్‌లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్‌లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్‌సీఎల్‌లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్‌తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్‌గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్‌లు, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్‌లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్‌లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్‌తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్) -
కరోనా: తగ్గనున్న అయిదు మెడికల్ ఉత్పత్తుల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉధృతి సమయంలో పల్స్ ఆక్సీమీటర్లు, ఇతర పరికరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపించాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ వాస్తవ ధర కంటే దాదాపు రెండుమూడు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్, డిజిటల్ థెర్మామీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటిపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ ఎన్పీపీఏ ఉత్తర్వులు వెలువరించింది. తయారీ, దిగుమతి, మార్కెటింగ్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వీటి విక్రయం ద్వారా 709 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపింది. తయారీ సంస్థలు ఇక నుంచి వీటి ధరలను సవరించాల్సిందే. జూలై 20 నుంచి తాజా ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013 ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను తయారీదార్లు ఉల్లంఘించినట్టయితే అధికంగా వసూలు చేసిన మొత్తానికి 15 శాతం వార్షిక వడ్డీతోపాటు 100 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్సీజన్ కాన్సంట్రేటర్లపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మెక్‌గ్రాత్ చేతికి గులాబీ టోపీలు
సిడ్నీ టెస్టు మూడో రోజు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సంతకాలతో కూడిన గులాబీ రంగు టోపీలను దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు తిరిగిచ్చారు. రొమ్ము క్యాన్సర్‌తో మృతి చెందిన మెక్‌గ్రాత్ భార్య జేన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు నిధుల సమీకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జనవరిలో నిర్వహించే తొలి టెస్టులో ఆటగాళ్లు ‘పింక్’ కలర్లోని క్రీడా సామాగ్రితో మైదానంలో దిగుతారు. దీనికోసం భారత కెప్టెన్ కోహ్లి సైతం గులాబీ రంగు గ్రిప్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇదే సందర్భంలో మ్యాచ్‌కు ముందురోజు ఇరు జట్ల ఆటగాళ్లకు గులాబీ టోపీలు ఇచ్చారు. వీటినే ఆటగాళ్లు శనివారం తిరిగిచ్చారు. దీనిపై ‘మైదానంలోనే కాదు... బయట కూడా భారత క్రికెట్ జట్టు అభిమానం పొందింది. అద్భుతమైన సహకారం’ అంటూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది -
టోపీలు జిందాబాద్!
న్యూఢిల్లీ: ఇఫ్తార్ విందు....ఇది ముస్లిం మతస్థులు రోజంతా అన్న పానీయాలు లేకుండా ఉపవాసం ఉండి...దాని ముగింపుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఖుషీగా విందారగించే సాధారణ సంఘటన. ఇంతకుముందు కుటుంబం, స్నేహితుల వరకే పరిమితమైన ఈ విందును కుహనా సామ్యవాద పార్టీలు (సూడో సెక్యులరిస్ట్ పార్టీలు) కాస్తా ఇఫ్తార్ పార్టీగా మార్చాయి. వీటికి హంగామాను జోడించి అట్టాహాసంగా జరుపుకునే పార్టీలుగా తీర్చిదిద్దాయి. ఓట్ల రాజకీయాల్లో భాగంగా ముస్లిం మిత్రులను పిలుస్తూ ఇఫ్తార్ పార్టీలను ఏర్పాటు చేయడం రాజకీయ పార్టీలకు ప్రహసనంగా మారిపోయాయి. ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీలకు అనుగుణంగా పర్షియన్ లేదా అరబ్ సంస్కృతులను ప్రతిబింబించేలా దుస్తులను ధరించి వెళ్లడం కూడా రాజకీయ నేతల రీతిగా మారింది. ఈసారి ఇఫ్తార్ విందులకు హాజరైన వివిధ రాజకీయ నేత ల్లో ఎవరి గెటప్ బాగుందో తేల్చుకునేందుకు పోటీ పెట్టి ఉన్నట్టయితే బహూశ సమాజ్‌వాది అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు దక్కేదేమో. నవతరం రాజకీయవాదిగా రంగప్రవేశంచేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి రాజకీయాలకు అతీతుడు కాడేమో! ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో కేజ్రివాల్ బుద్ధిగా తెల్లటి రూమీ టోపీ ధరించగా, ఆయన పక్కనేవున్న ముస్లిం సోదరులు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాత్రం ఎలాంటి టోపీలు ధరించకపోవడం గమనార్హం. ఎక్కువ హిందువుల ఓట్లపై ఆధారపడే బీజేపీ మాత్రం ఇఫ్తార్ పార్టీలకు కొంత దూరంగానే ఉంటోందని చెప్పవచ్చు. విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడపివచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇఫ్తార్ విందులకు దూరంగానే ఉన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు తమ సంప్రదాయం ప్రకారం రూమీ టోపీని పెట్టబోతే బహిరంగంగానే ఆయన వారించారు. కారణం హిందువుల ఓట్లు పోతాయన్న భయమే. ప్రముఖ ఉర్దూ కథల రచయిత సాదత్ హసన్ మాంటో ‘బాతే’ పేరిట రాసిన కథ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్రానికి ముందు 1942లో ముంబైలో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లను వర్ణిస్తూ ‘మనం ఏదో పని మీద బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మనం రెండు టోపీలు దగ్గర పెట్టుకోవాలి. ఒకటి హిందూ టోపీ. మరొకటి రూమీ టోపి. హిందువుల కాలనీ నుంచి వెళుతున్నప్పుడు హిందువుల టోపీ పెట్టుకుందాం. ముస్లింల కాలనీ నుంచి వెళుతుంటే రెండోది పెట్టుకుందాం. ఎందుకైనా మంచిది గాంధీ టోపీని కూడా దగ్గర పెట్టుకుందాం. అది అవసరమని అనిపించినప్పుడు దాన్నీ ధరిద్దాం. ఇంతకుముందు విశ్వాసాలు హృదయాల్లో ఉండేవి. ఇప్పుడు టోపీల్లో ఉంటున్నాయి. టోపీలు జిందాబాద్!’. -
మేన్లీగా... మేనుకు హాయిగా...
ముస్తాబు ఎండ చుర్రుమంటుంటే! చెమట చుట్టమై, ఉక్కపోత నేస్తమై ఆప్యాయంగా అంటిపెట్టుకుని ఉండే కాలం. వంటి మీద దుస్తుల్ని మించిన శతృవులు లేవనిపించే కాలం. వేసవి అంటేనే వేడికి విడిది. ఈ సీజన్లో ఫ్యాషన్లను అనుసరించడమంటే... మంటేనంటారు చాలా మంది. అయితే అటు సమ్మర్‌పై వార్ చేస్తూనే ఇటు ఫ్యాషన్ల హుషార్ అనిపించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు ప్రసిద్ధ డిజైనర్ సాహిల్గులాటి. మేనును మెరిపించే ఫ్యాషన్లను ‘మే’నెలలో కూడా హాయిగా ఫాలో అయిపోవచ్చునంటున్నారు. చెమటకు చెక్... చొక్కా... పొడుగు చేతుల చొక్కా మరీ అలవాటైతే తప్ప ఈ సీజన్లో వదిలేయడం మంచిది. మరీ ఫ్యాషన్‌ను అనుసరించే వారు కాకపోతే... టైట్ ఫిట్ షర్ట్స్‌కు బదులు కొంచెం వదులుగా ఉండేవి వాడవచ్చు. ఫ్యాషన్ ప్రియుల కోసం స్మాల్ ప్రింట్స్, ఫ్లోరల్ ప్రింట్స్, జామెట్రికల్ ప్రింట్స్ వంటి వెరైటీలు తాజా ట్రెండ్ గా, సీజన్‌కు నప్పేలా అందుబాటులోకి వచ్చాయి. వేసవిలో హాయిగా ఉండవచ్చు కానీ ప్రస్తుతం కుర్తా ఫ్యాషన్ కాదని గమనించాలి. టీషర్ట్స్ ధరించేవారు స్లిమ్‌ఫిట్, రౌండ్నెక్ను ఎంచుకోవచ్చు. చల్లదనానికి ఫ్యా‘బ్రిక్స్’... ఈ సీజన్లో సిల్క్లూ, సింథటిక్ల జోలికి పోకపోవడం ఎంతైనా ఉత్తమం. ఒకప్పుడైతే కాటన్‌ను మించి సమ్మర్‌కు నప్పే ఫ్యాబ్రిక్ మరొకటి లేదు కాని... ఇప్పుడు మరికొన్ని కూడా దానితో పోటీపడుతూ సమ్మర్‌ను ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నాయి. అలాంటివాటిలో లినెన్ది అగ్రస్థానం. లినెన్‌తో తయారైన దుస్తులు అటు చల్లదనాన్ని అందిస్తూనే ఇటు ఫ్యాషన్‌కూ పెద్ద పీట వేస్తున్నాయి. కాటన్, లినెన్ తర్వాత ఎంచుకోదగ్గ ఫ్యాబ్రిక్ వాయిల్. లేత రంగులే... లే‘టేస్టు’గా... ఎండాకాలంలో ధరించే దుస్తులకు సంబంధించి రంగులను ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. ముదురు రంగులకు గుడ్‌బై చెప్పి లేతరంగులనే ఎంచుకోవాలి. అంతమాత్రాన తెలుపు వంటి ఒకటీ అరా రంగులకే పరిమితం కావాలని అనుకోవద్దు. ప్రస్తుత ఫ్యాషన్లకు అనుగుణంగా, విభిన్న రకాల లైట్-బ్రైట్ కలర్స్ సీజన్‌కు తగ్గట్టు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ... ఇంకా పలు నియోన్ కలర్స్‌ను వినియోగించవచ్చు. వేసవికి నప్పే రంగుల్లో నెంబర్‌వన్ అయిన తెలుపును అంతగా ఇష్టపడని వారు మిల్క్వైట్కు ఓటేయవచ్చు. షార్ట్ అండ్ కూల్... కాస్త ఆధునికంగా డ్రెస్ చేసుకోవడం అలవాటైన వారైతే హాయిగా షార్ట్స్‌కు జైకొట్టవచ్చు. ఇప్పుడు రకరకాల బెర్ముడాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అటు ఫ్యాషనబుల్‌గానూ, ఇటు సీజన్‌కు సరిగ్గా సరిపోయేట్టుగానూ ఇవి ఉపకరిస్తాయి. ఈ షార్ట్స్‌లో కాటన్, లినెన్ మాత్రమే కాకుండా డెనిమ్ ఫ్యాబ్రిక్‌లో కూడా వెరైటీలున్నాయి. ఇక ట్రౌజర్స్ విషయానికి వస్తే... తెలుపు, బేజ్, మస్టర్డ్, క్రీమ్, బ్లూ... రంగుల్లో కాటన్, లినెన్, ఫేడెడ్ డెనిమ్స్ నుంచి ఎంచుకోవచ్చు. అవీ ఇవీ... కాళ్లకు చెప్పులు కేవలం రక్షణ మాత్రమే కాదు వేసవిలో అత్యవసరం కూడా. పాదరక్షలు అటు మన ఫ్యాషన్ స్పృహను కూడా పరిరక్షించాలంటే క్యాజువల్ శాండిల్స్‌తో పాటు లోఫర్స్, స్నీకర్స్ వంటి వాటికి ఓటేయాలి. అలాగే తక్కువ హెయిర్, పొట్టిజుత్తులే ఈ సీజన్‌కు నప్పేవి. అలా కాదు లాంగ్‌హెయిర్ తప్పదంటే పోనీటెయిల్‌ని ట్రై చేయవచ్చు. అటు ఫ్యాషన్, ఇటు సీజన్ రెండూ సమన్వయం చేసుకోవాలంటే స్పైక్ స్టైల్ హెయిర్‌కి జై కొట్టాల్సిందే. స్పైక్‌లో విభిన్న రకాల వెరైటీలున్నాయి కాబట్టి... తమ తమ అభిరుచులకు, ముఖవర్ఛస్సుకు తగ్గట్టు ఎంచుకోవచ్చు. క్లీన్షేవ్ లేదా యాక్సెసరీస్ విషయానికి వస్తే సహజంగానే అతి తక్కువగా ఫంకీగా ఉండే జంక్ జ్యుయలరీని వాడాలి. గోల్డ్ చెయిన్లు, బ్రాస్లెట్ల వంటివి ఈ కాలానికి నప్పవు. ఉడెన్ జ్యుయలరీని ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాషన్ పరంగా ఆకట్టుకుంటున్న క్లచ్బ్యాగ్స్ను వినియోగిస్తే అటు మోడ్రన్‌గానూ, ఇటు ఉపకరించే యాక్సెసరీగానూ ఉంటుంది. మగవాళ్లకు క్యాప్స్ ధరించేందుకు సమ్మర్ ఒక అద్భుతమైన అవకాశం. ఈ సీజన్లో దాదాపు రోజంతా క్యాప్ పెట్టుకున్నా లుక్ ఓకె అనిపిస్తుంది. ఇక చివరిదైనా చాలా ముఖ్యమైనవి గాగుల్స్. అతినీల లోహిత కిరణాలు కంటికి హాని చేయకుండా ముఖానికి నప్పే గాగుల్స్‌ని తప్పనిసరిగా వినియోగించాల్సిందే. - ఎస్. సత్యబాబు