
ఐదేళ్ల తర్వాత ‘గ్రాస్’ టైటిల్...
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్‌లో 66వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన మెర్సిడెస్ కప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో నాదల్ 7-6 (7/3), 6-3తో విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా)పై గెలిచాడు. తద్వారా ఐదేళ్ల విరామం తర్వాత గ్రాస్‌కోర్టులపై మరో ట్రోఫీని అందుకున్నాడు. 2010లో వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత నాదల్ ఖాతాలో మరో గ్రాస్‌కోర్టు టైటిల్ చేరడం ఇదే ప్రథమం.