మెల్‌బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్, రెండో సీడ్ వోజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో వీరిద్దరిలో ఎవరు గెలిచినా కొత్త చాంపియన్‌గా అవతరిస్తారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 6–3, 4–6, 9–7తో మాజీ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. మరో సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–3, 7–6 (7/2)తో ఎలీస్ మెర్‌టెన్స్ (బెల్జియం)ను ఓడించింది.
పోరాడి ఓడిన కెర్బర్: ప్రపంచ 21వ ర్యాంకర్, 2016 చాంపియన్ కెర్బర్ తొలిసెట్లో తేలిగ్గానే తలొగ్గినా... తర్వాతి సెట్లలో కడదాకా పోరాడింది. ఒక దశలో టాప్ సీడ్ హలెప్ 6–3, 3–1 స్కోరుతో ఆధిక్యంలో ఉండటంతో వరుస సెట్లలోనే కెర్బర్‌కు ఓటమి ఖాయమనిపించింది. అయితే జర్మనీకి చెందిన ఈ మాజీ చాంపియన్ తన శక్తినంత కూడదీసుకొని రెండో సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో మరో మారథాన్ మ్యాచ్‌లా తలపించినా చివరకు నంబర్‌వన్ హలెప్ పవర్‌షాట్లతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో సెమీఫైనల్లో వోజ్నియాకికి రెండో సెట్‌లో అన్‌సీడెడ్ మెర్టన్స్ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఇందులో రెండో సీడ్ వోజ్నియాకి తన అనుభవంతో ప్రత్యర్థిని సులభంగానే చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో ఆరో సీడ్ సిలిచ్ 6–2, 7–6 (7/4), 6–2తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)ను ఓడించాడు.
టైటిల్ పోరుకు హలెప్, వొజ్నియాకి
Published Fri, Jan 26 2018 1:15 AM | Last Updated on Fri, Jan 26 2018 1:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment