కేప్‌టౌన్: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆధునిక క్రికెట్‌లో హార్దిక్ తనదైన మార్కును చూపిస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడంటూ కొనియాడాడు. భారత క్రికెట్ జట్టకు దొరికిన ఒక వరంగా హార్దిక్‌ను క్లూసెనర్ అభివర్ణించాడు.
'భారత జట్టులో అద్బుతమైన ఆల్ రౌండర్ హార్దిక్. చాలా స్వల్ప కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అదే క్రమంలో టీమిండియా రెగ్యులర్ సభ్యనిగా మారిపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ది కచ్చితంగా అద్వితీయమైన ఇన్నింగ్సే. భారత జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో హార్దిక్ ఆడిన తీరు నిజంగా అద్భుతం. అతని ఆట తీరుతో మా జట్టును ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. అతను పేస్ బౌలింగ్‌లో ఇంకా వైవిధ్యాన్ని కనబరిస్తే ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎదుగుతాడు' అని క్లూసెనర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment