
ముంబై: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫిట్‌నెస్ అందుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటననుంచి తిరిగొచ్చిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు దూరమైన అతను వెన్ను గాయంనుంచి కోలుకొని ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నాడు. గురువారం అతను ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. మరో వైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ కమలేశ్ నాగర్‌కోటి వరుసగా రెండో ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్‌కు దూరం కానున్నాడు. 2018లో కూడా కమలేశ్ గాయంతో చివరి నిమిషంలో ఐపీఎల్‌నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో కోల్‌కతా కేరళ పేసర్ సందీప్ వారియర్‌ను తీసుకుంది. ఈ ఏడాది రంజీల్లో 44 వికెట్లు తీసి కేరళ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వారియర్... 2013–15 మధ్య ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment