సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–23 పురుషుల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఈసీఐఎల్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో హరియాణా చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 48.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (71 బంతుల్లో 37; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. పీఎస్ చైతన్యరెడ్డి (23), సి. హితేశ్ యాదవ్ (27) పరవాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంఎం బూరా 3 వికెట్లు దక్కించుకోగా... ఎంఎస్ రాథీ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హరియాణ జట్టు 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. వీఏ భరద్వాజ్ (65), ప్రశాంత్ వశిష్ట్ (64 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. అజయ్‌దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్ చెరో 2 వికెట్లు తీశారు. విజేతగా నిలిచిన హరియాణా జట్టుకు 4 పాయింట్లు లభించాయి. ఆదివారం జింఖానా మైదానంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రతో హైదరాబాద్ తలపడుతుంది.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
జార్ఖండ్: 330/9 (వివేక్ కుమార్ 106, కుమార్ సూరజ్ 101; నీలంబుజ్ 4/62), త్రిపుర: 120 (సుశాంత్ మిశ్రా 3/34, సోను కుమార్ 3/30).
సౌరాష్ట్ర: 271/7 (కెవిన్ 83, తరన్‌గోహెచ్ 59), బరోడా: 276/4 (జేకే సింగ్ 125; పార్థ్ 3/36).
Comments
Please login to add a commentAdd a comment