మిల్నె అవుట్.. హెన్రీ ఇన్ | Henry replaces injured Milne in New Zealand squad | Sakshi
Sakshi News home page

మిల్నె అవుట్.. హెన్రీ ఇన్

Published Mon, Mar 23 2015 11:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

ఆడమ్ మిల్నె(ఫైల్)

ఆడమ్ మిల్నె(ఫైల్)

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నె గాయంతో వరల్డ్ కప్ సెమీస్ పోరుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి రానున్నాడు. మిల్నె స్థానంలో హెన్రీని తీసుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. వెస్టిండీస్ తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మిల్నె ఇబ్బందిగా కదిలాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఎమ్మార్ స్కాన్ తీయగా ఎడమ మడం చుట్టు వాపు ఉన్నట్టు తెలిసింది. దీంతో అతడు తర్వాతి మ్యాచ్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ ను మిల్నె బౌల్డ్ చేశాడు. 23 ఏళ్ల మిల్నె ఇప్పటివరకు 8 వన్డేలు, 2 టి20 మ్యాచ్ లు ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement