ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్ ప్రారంభ మ్యాచ్‌పై అస్పష్టత తొలిగింది. ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న జరుపుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ముంబై, నాగ్‌పూర్, పుణేలలో జరిగే మిగతా 19 మ్యాచ్‌లపై నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఈనెల 12న జరిగే విచారణలో ఈ విషయంలో ఓ స్పష్టత రానుంది.
మహారాష్ట్రలో కరవు పరిస్థితి నేపథ్యంలో లక్షల లీటర్ల నీరు అవసరమయ్యే ఈ మ్యాచ్‌లను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు తొలి మ్యాచ్ తరలింపు సాధ్యం కాదనే కారణంతో కోర్టు అనుమతించింది.
ప్రారంభ మ్యాచ్‌కు హైకోర్టు అనుమతి
Published Fri, Apr 8 2016 1:19 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement