ఆసీస్ ఆటగాళ్లు
సిడ్నీ : ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతి సారీ తమ ఆటగాళ్ల తప్పును కప్పిపుస్తూ వెనకెసుకొచ్చె ఆసీస్ మీడియా ఈసారి మాత్రం అందుకు విరుద్దంగానే ప్రవర్తించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై విమర్శల బాణాలను ఎక్కిపెడుతూ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి, ‘స్మిత్స్ షేమ్’ అని స్థానిక మీడియా చానెళ్లు సైతం ఆగ్రహం వెల్గగక్కాయి.
ఇదే తరహాలో ఓ ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ తమ ఆటగాళ్ల తొండాటపై ఓ స్పూఫ్ వీడియో రూపొందించి మరి ట్రోల్ చేస్తోంది. ఈ వీడియోలో తాజా ట్యాంపరింగ్‌తో పాటు 1981 వరల్డ్‌కప్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రేగ్ చాపెల్ అతని సోదరుడు ట్రివర్ చాపెల్‌కు అండర్‌ఆర్మ్ బౌలింగ్ చేయాల్సిందిగా సూచించాడాన్ని కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ బెన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇది జట్టు వ్యూహంలో భాగమేనని కెప్టెన్ స్మిత్ ప్రకటించడంపై తీవ్ర దూమారం రేగింది. ఇప్పటికే ఐసీసీ స్మిత్‌పై ఓ మ్యాచ్ నిషేదం, మ్యాచ్ ఫీజు కోత విధించింది. బెన్ క్రాఫ్ట్, డెవిడ్ వార్నర్‌లకు సైతం మ్యాచ్ ఫీజు కోతతో జరిమానా విధించింది. ఇక ఆసీస్ మీడియా కథనాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఈ ముగ్గురి ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేదం విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment