హాంకాంగ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం
దుబాయ్: హాంకాంగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండున్నరేళ్లు నిషేధాన్ని విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించాడన్న ఆరోపణలతో ఐసీసీ 2015 నవంబర్ 4న అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
గతంలో బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని ఇర్ఫాన్‌ను సంప్రదించినట్లు ఆరోపణలు వచ్చాయి. అవినీతికి పాల్పడకపోయినా, ఆ విషయాన్ని ఏసీయూ దృష్టికి తీసుకురానందుకు నిషేధం పడింది.