హైదరాబాద్ జట్ల శుభారంభం | hyderabad team won opening matches in throw ball championship | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జట్ల శుభారంభం

Published Sat, Aug 13 2016 11:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

hyderabad team won opening matches in throw ball championship

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌లో శుక్రవారం పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 15-5, 15-8తో మెదక్ జట్టుపై విజయం సాధించగా... మహిళల విభాగంలో హైదరాబాద్ జట్టు 15-3, 15-2తో కరీంనగర్ జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల విభాగంలో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రంగారెడ్డి జట్టు 15-6, 15-4తో కరీంనగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 15-8, 15-6తో మహబూబ్‌నగర్‌పై, హైదరాబాద్ 15-5, 15-12తో నిజామాబాద్‌పై, రంగారెడ్డి 15-8, 15-13తో ఖమ్మంపై, వరంగల్ 15-8, 15-11తో నల్లగొండపై గెలుపొందాయి.

 

మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు 15-07, 15-04తో మెదక్‌పై, వరంగల్ జట్టు 15-09, 04-15, 15-11తో నల్లగొండపై, ఆదిలాబాద్ జట్టు 15-05, 15-07తో మహబూబ్‌నగర్‌పై, హైదరాబాద్ జట్టు 15-04, 15-02తో నిజామాబాద్ జట్లపై నె గ్గాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనికారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్ మోహన్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్క కొమురయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement