
సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాయి. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 34–28తో నల్లగొండపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 15–13తో ఆధిక్యంలో ఉన్న హైదరాబాద్ చివరివరకు దాన్ని కాపాడుకుంది. రెండో సెమీస్‌లో వరంగల్ 38–19తో రంగారెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల సెమీస్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 24–22తో ఖమ్మంపై గెలుపొందగా, నల్లగొండ 36–32తో రంగారెడ్డిని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment