
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు మెరిశాయి. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల జట్టు టైటిల్‌ను గెలువగా, మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 9–3తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. మేడ్చల్ జట్టుకు మూడోస్థానం దక్కింది. మహిళల టైటిల్‌పోరులో నిజామాబాద్ 1–0తో హైదరాబాద్‌ను ఓడించింది.
ఈ విభాగంలో రంగారెడ్డి జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్ బాబు, మాజీ ఎమ్మెల్యే శేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment