సాక్షి, హైదరాబాద్: రీజినల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ (ఆర్‌ఈఎల్) తొలి ఎడిషన్ పోటీల్లో హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్‌పీఆర్‌సీ) రైడర్ జైవీర్ వర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అజీజ్ నగర్‌లో జరిగిన ఈ లీగ్‌లో డ్రెస్సేజ్ చిల్డ్రన్–1, షో జంపింగ్ చిల్డ్రన్–2 ఈవెంట్‌లలో విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఈక్వెస్ట్రియన్ సంఘం (టీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ లీగ్‌లో చిల్డ్రన్–1 (అండర్–14), చిల్డ్రన్–2 (అండర్–12), జూనియర్ (అండర్–18), సీనియర్ వయో విభాగాల్లో... డ్రెస్సేజ్, షో జంపింగ్, టెంట్ పేగింగ్ ఈవెంట్‌లలో పోటీలను నిర్వహిస్తున్నారు. తొలి ఎడిషన్ లీగ్‌లో విజేతగా నిలిచిన చిన్నారులు నవంబర్ 24, 25 తేదీల్లో ఇదే వేదికపై జరుగనున్న రెండో ఎడిషన్ ఆర్‌ఈఎల్ లీగ్‌కు అర్హత సాధిస్తారు. రెండో ఎడిషన్‌లోనూ విజేతగా నిలిచినవారికి నేషనల్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి రైడర్లను అభినందించారు. భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య ప్రతినిధి ఏఏ మహమూద్, కల్నల్ ఎస్‌ఎల్ రెడ్డి, కేసీఎస్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
తొలి ఎడిషన్ క్వాలిఫయర్స్ వివరాలు..
డ్రెస్సేజ్ చిల్డ్రన్–2: జైవీర్ (హెచ్‌పీఆర్‌సీ).
డ్రెస్సేజ్ చిల్డ్రన్–1: కె. శశాంక్ వర్మ (హెచ్‌పీఆర్‌సీ), ఇషా గోకరాజు (హెచ్‌పీఆర్‌సీ).
డ్రెస్సేజ్ జూనియర్స్: కున్వర్ విశాల్ సింగ్ (హెచ్‌పీఆర్‌సీ).
షో జంపింగ్ చిల్డ్రన్–2: జైవీర్ వర్మ (హెచ్‌పీఆర్‌సీ), శ్రీవత్సాంకిత్ (హెచ్‌పీఆర్‌సీ).
షో జంపింగ్ చిల్డ్రన్–1: మొహమ్మద్ అయాన్ (హెచ్‌పీఆర్‌సీ), తనిష్క్ రెడ్డి (ఎంహెచ్‌ఆర్‌ఏ).
షో జంపింగ్ జూనియర్స్: గార్గేయ రెడ్డి (ఎంహెచ్‌ఆర్‌ఏ).
టెంట్ పేగింగ్ సీనియర్స్: అలన్ షాన్ మైకేల్ (ఎంహెచ్‌ఆర్‌ఏ).
Comments
Please login to add a commentAdd a comment