భారత్- పాక్ క్రికెట్ పునరుద్ధరిస్తాం
ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్
కరాచీ: భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని ఐసీసీ కొత్త అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ఐసీసీ అధ్యక్ష హోదాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ‘భారత్, పాక్ దేశాల అభిమానులు తమ జట్ల మధ్య క్రికెట్ జరగాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం నేను కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం. ఈ జట్ల మధ్య తరచుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం క్రికెట్‌కు కూడా మంచిది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశమని తెలుసు. కానీ నా తరఫున సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ఎక్కువ సిరీస్‌లు జరిగితే ఆటగాళ్లు, అభిమానులకు కూడా సంతృప్తినిస్తుంది’ అని అబ్బాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.