
ఇస్లామాబాద్: టీమిండియా హిట్‌మ్యాన్, ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికి ఇష్టపడతానని పేర్కొన్నాడు. అంతేకాకుండా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీవీ నుంచి పక్కకు జరగనని, తదేకంగా అతడి బ్యాటింగ్ చూస్తూ ఉండిపోతానన్నాడు. మంగళవారం స్థానిక ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ అబ్బాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో రోహిత్ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా అతడి షాట్స్ సెలక్షన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా షాట్స్ ఎంపిక చాలా వేగంగా ఉంటుంది. అయితే నేను కోహ్లిని తక్కువ చేసి మాట్లాడటం లేదు (కోహ్లి గురించి ప్రశ్నించిన సమయంలో). కోహ్లి కోహ్లినే. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియా బ్యాటింగ్‌కు అతడు వెన్నెముక. ఓవరాల్‌గా రోహ్లి, కోహ్లిల బ్యాటింగ్‌తో ఓ క్రికెటర్‌గా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అంటూ జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా జహీర్ అబ్బాస్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment