'కోహ్లీ కెప్టెన్సీకి వేళయింది'
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యహరించిన విరాట్ కోహ్లీకి పూర్తి స్థాయి కెప్టెన్సీ ఇవ్వాలనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. అడిలైడ్ లో జరిగిన తొలిటెస్టులో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న కోహ్లీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పాలని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కోహ్లీకి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పచెప్పడానికి ఇదే సరైన సమయమని చాపెల్ పేర్కొన్నాడు.
అయితే కోహ్లీ తన ఎమోషన్స్ నియంత్రించుకోలేకపోవడాన్ని మాత్రం ఛాపెల్ ఎత్తిచూపాడు. తొలిటెస్టులో నాల్గోరోజు ఆటలో కోహ్లీ ప్రవర్తించిన తీరు ఎంతమాత్రం సరికాదన్నాడు. ఈ తరహా ఘటనలు అతని కెప్టెన్సీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు.