భారత్ క్రికెట్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, బోర్డు మాజీ బాస్, ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకంగా శశాంక్ పనిచేస్తున్నారని ఆరోపించారు. భారత క్రికెట్ బోర్డులో శశాంక్ అవసరం ఉన్నప్పుడు ఆయన వైదొలిగారని అనురాగ్ విమర్శించారు.
'బీసీసీఐ శశాంక్ సాయం కోరినపుడు, ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధపడలేదు. ఈ రోజు ఆయన ఈ స్థానంలో ఉండటానికి బీసీసీఐనే కారణం. అయితే ఆయన భారత క్రికెట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బోర్డులో చాలామంది సభ్యుల అభిప్రాయం ఇదే. బోర్డుకు అవసరమైనపుడు ఆయన మునిగిపోతున్న నౌకను వదిలిపోయారు' అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
టెస్టు క్రికెట్పై శశాంక్ అభిప్రాయాలను ఠాకూర్ ప్రస్తావించారు. ఐసీసీ చైర్మన్ టెస్టు క్రికెట్కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే, ఎవరైనా ఏం చేయగలరు? బీసీసీఐ టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లను నిర్వహిస్తోందని చెప్పారు.