'బొంబేలా' బాణం దూసుకెళ్లింది | India archer Bombayla Devi reaches round 16 at Rio 2016 Olympics | Sakshi
Sakshi News home page

'బొంబేలా' బాణం దూసుకెళ్లింది

Published Wed, Aug 10 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

'బొంబేలా' బాణం దూసుకెళ్లింది

'బొంబేలా' బాణం దూసుకెళ్లింది

భారత మహిళా ఆర్చర్ బొంబేలా దేవి ముందంజ వేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా బుధవారం సాయంత్రం జరిగిన రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బాల్డఫ్ పై నెగ్గింది. అనంతరం చైనీస్ తైపీకి చెందిన లిన్ షి చియాను రౌండ్-32 లో 6-2 తేడాతో ఓడించి రౌండ్-16కు దూసుకెళ్లింది. చియాపై తొలి రెండు సెట్లు కైవసం చేసుకున్న బొంబేలా దేవి మూడో సెట్ ప్రత్యర్ధికి కోల్పోయి కాస్త వెనుకంజ వేసినా వెంటనే పుంజుకుని నాలుగో రౌండ్లో మెరుగైన స్కోరు సాధించి విజయాన్ని నమోదు చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement