bombayla devi
-
బొంబేలా, దీపికా కుమారి ఔట్!
రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బొంబేలా దేవి కథ ముగిసింది. మొదట దీపిక ఓటమి పాలవ్వగా, ఆమె బాటలోనే బొంబేలా దేవి నడిచి నిరాశపరిచింది. ప్రీక్వార్టర్స్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి టన్యా టింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపిక 0-6తో పరాజయాన్ని చవిచూసింది. 27-28, 26-29, 27-30తో వరుస సెట్లను కోల్పోయి రియో నుంచి నిష్క్రమించింది. అనంతరం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బొంబేలా దేవి 6-2తేడాతో మెక్సికోకు చెందిన వాలేన్సికా చేతిలో ఓటమి చెందింది.భారత ఆర్చర్లు ఇద్దరూ ప్రి క్వార్టర్స్ (రౌండ్-16)లోనే ఇంటిదారి పట్టారు. -
'బొంబేలా' బాణం దూసుకెళ్లింది
భారత మహిళా ఆర్చర్ బొంబేలా దేవి ముందంజ వేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా బుధవారం సాయంత్రం జరిగిన రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బాల్డఫ్ పై నెగ్గింది. అనంతరం చైనీస్ తైపీకి చెందిన లిన్ షి చియాను రౌండ్-32 లో 6-2 తేడాతో ఓడించి రౌండ్-16కు దూసుకెళ్లింది. చియాపై తొలి రెండు సెట్లు కైవసం చేసుకున్న బొంబేలా దేవి మూడో సెట్ ప్రత్యర్ధికి కోల్పోయి కాస్త వెనుకంజ వేసినా వెంటనే పుంజుకుని నాలుగో రౌండ్లో మెరుగైన స్కోరు సాధించి విజయాన్ని నమోదు చేసింది.