: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత జట్టు అంధుల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. లాల్‌బహదూర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. సురంగ సంపత్ (49; 5 ఫోర్లు), చందన దేశప్రియ (42; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో రణ్‌బీర్ పన్వర్, సునీల్ రెండేసి వికెట్లు తీయగా... అజయ్ కుమార్ రెడ్డి, గోలూ కుమార్‌లకు ఒక్కో వికెట్ లభించింది.
175 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోకుండా 13 ఓవర్లలో అధిగమించింది. ఓపెనర్ ప్రకాశ్ (52 బంతుల్లో 115 నాటౌట్; 23 ఫోర్లు) అజేయ సెంచరీ చేయగా... ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి (30 బంతుల్లో 51 నాటౌట్) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. శనివారం కర్ణాటకలోని ఆలూర్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో... ఆదివారం బెంగళూరులో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది.
ఫైనల్లో భారత్
Published Fri, Feb 10 2017 4:14 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement