సాక్షి, హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు అంధుల టి20 ప్రపంచకప్‌లో కీలకపోరుకు సిద్ధమైంది. శుక్రవారం లాల్ బహదూర్ స్టేడియం వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో శ్రీలంక జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్‌కుమార్ రెడ్డి సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నీ లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించి 24 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పాక్‌పై మినహా లీగ్ దశలో అన్ని జట్లపై నెగ్గిన భారత్ అదే జోరును సెమీస్‌లోనూ కనబర్చి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ టోర్నీలో భారత బ్యాట్స్‌మెన్ అజయ్ కుమార్, సునీల్ ఒక్కో సెంచరీ చేయగా... ప్రకాశ్, కేతన్ పటేల్, వెంకటేశ్వర రావు త్రుటిలో సెంచరీలను కోల్పోయారు.
మరోవైపు కర్ణాటకలోని ఆలూర్‌లో శుక్రవారమే జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. పాకిస్తాన్ లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 27 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 21 పాయింట్లతో శ్రీలంక మూడో స్థానంలో, 18 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో నిలిచారుు. 10 జట్ల మధ్య లీగ్ దశ పోటీలు ముగిశాక టాప్-4లో నిలిచిన పాక్, భారత్, శ్రీలంక, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
శ్రీలంకతో భారత్ అమీతుమీ
Published Fri, Feb 10 2017 10:19 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement