భారత్‌కు పదో స్థానం
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా జూనియర్ డేవిస్ కప్ అండర్–16 టోర్నమెంట్‌లో భారత జట్టు పదో స్థానంలో నిలిచింది. ఇక్కడి డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో తొమ్మిదో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 0–2తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో క్రిస్ వీ షింగ్ జాంగ్ 6–4, 6–4తో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీపై గెలుపొందగా.... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో జార్జ్ డంకన్ స్టౌప్ 6–7 (4/7), 6–3, 6–0తో సచిత్ శర్మను ఓడించాడు. కాగా ఈ టోర్నీలో జపాన్ 2–1తో ఆస్ట్రేలియాపై గెలిచి విజేతగా నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీ, చైనా జట్లు సెప్టెంబర్‌లో హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగే వరల్డ్ గ్రూప్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.