ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు.
కొవెంట్రీ: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. తొలిరోజు రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో పడగా.. గురువారం రెండో రోజు 125 కేజీ విభాగంలో వైభవ్ రాణా రజత పతకం సాధించాడు. మరోవైపు 100 కేజీ రా విభాగంలో పోటీపడిన కన్వర్‌దీప్ కాంస్యం సాధించాడు. దీంతో మొత్తం ఆరు పతకాలు భారత్ వశమయ్యాయి.