లండన్: వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా నిలిచింది. తాజాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ సాధించడంతో భారత్ 27వ వరల్డ్‌కప్ సెంచరీని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఆసీస్‌ను వెనక్కు నెట్టిన భారత్ అగ్రస్థానానికి వచ్చింది. శిఖర్ ధావన్ సెంచరీ సాధించడం ద్వారా భారత్ ఈ మార్కును చేరింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో ధావన్ సెంచరీతో మెరిశాడు. 109 బంతులు ఎదుర్కొన్న ధావన్ 16 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
(ఇక్కడ చదవండి: ధావన్ అదుర్స్)
వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్ల జాబితాలో భారత్(27 సెంచరీలు) తొలి స్థానానికి చేరగా, ఆస్ట్రేలియా(26 సెంచరీలు) రెండో స్థానంలో ఉంది. శ్రీలంక(23), వెస్టిండీస్(17), న్యూజిలాండ్(15)లు తర్వాత వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆపై దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్(14 సెంచరీలు)లు సంయుక్తంగా ఉన్నాయి. (ఇక్కడ చదవండి: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్)
Comments
Please login to add a commentAdd a comment