
పుష్కర కాలం తర్వాత టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. 2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో పసిడి పతకం నెగ్గిన భారత పురుషుల జట్టు గోల్డ్‌కోస్ట్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో విజయం సాధించింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, సానిల్ శెట్టి, ఆంథోనీ అమల్‌రాజ్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఆదివారం భారత మహిళల జట్టు కూడా స్వర్ణం నెగ్గడంతో 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో టీటీ ప్రవేశ పెట్టాక రెండు టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు రావడం ఇదే తొలిసారి.