మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్-భారత్ మధ్య చివరి మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), విరాట్ కోహ్లి (9) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2) శ్రేయాస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 4), మనీష్ పాండే (48 బంతుల్లో 42; ఫోర్లు 2) రాణించారు.
(చదవండి : ఆఖరి వన్డే: రికార్డు సొంతం చేసుకున్న అయ్యర్)
రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు.113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 112 పరుగులు చేశాడు. 300 పైచిలుకు పరుగులు చేస్తారనే అంచనాల నడుమ ఇన్నింగ్స్ 47 ఓవర్‌లో వరుస బంతుల్లో రాహుల్, మనీష్ ఔట్ కావడంతో టీమిండియా ఆ మార్కు చేరుకోలేకపోయింది. బెన్నెట్‌కు నాలుగు వికెట్లు, జేమీషన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పృథ్వీ షా రనౌట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment