
దుబాయ్: ఆసియాకప్ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ మాట్లాడుతూ..‘ఇక్కడ కొన్ని మ్యాచ్‌లు ఆడాం. ఫ్లడ్ లైట్స్ కింద ఆడటమే ఇక్కడ బెటర్.. దీంతో ఛేజింగ్‌కు మొగ్గుచూపుతున్నాం’ అని తెలిపాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హర్ధిక్ పాండ్యా ఈ సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. దీంతో పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా తుదిజట్టులోకి వచ్చాడు. ఇక బంగ్లాదేశ్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. పాక్‌తో గెలిచి రోహిత్ సేన ఉత్సాహంగా ఉండగా.. అఫ్గానిస్తాన్‌తో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి టైటిల్ రేసుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తుంది. విశ్రాంతి లేకుండా బరిలోకి దిగడం బంగ్లాదేశ్‌కు ప్రతికూలం కానుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), లిటన్ దాస్, మోమినుల్ హక్, షకీబ్, మిథున్, మçహ్ముదుల్లా, మొసద్దిక్ హొస్సేన్, హసన్ మిరాజ్, రుబెల్ హొస్సేన్, నజ్ముల్, అబు హైదర్.
Comments
Please login to add a commentAdd a comment