సాక్షి, నిడదవోలు: స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలోశ్రీలంకలో ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అండర్–22 ఆసియాకప్ క్రికెట్ పోటీలు జరిగాయి. దేశం తరుఫున నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన సోదరులు ఎండీ ఫీర్ మహ్మద్, ఎండీ హఫీజ్ ప్రాతినిధ్యం వహించారు. ఆరు దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఎండీ ఫీర్ మహ్మద్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగులు, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 రన్స్ చేసి బ్యాటింగ్‌లో రాణించగా, అతని సోదరుడు ఎండీ హఫీజ్ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసి, ఒక వికెట్ తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు చేసి, రెండు వికెట్లు తీశాడు. ఫైనల్‌లో శ్రీలంకతో భారతజట్టు తలపడగా 48 రన్స్ చేయడంతోపాటు రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా సత్తాచాటి భారతజట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సోదరిలిద్దరూ పాలిటెక్నిక్ చదువుతున్నారు. సత్తా చాటిన ఎండీ ఫీర్ మహ్మద్, ఎండీ హఫీజ్‌లను కోచ్‌లు రేవంత్‌కుమార్, అరుణ్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment