
భారత జట్లకు రెండో విజయం
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారుు.
బాకు (అజర్‌బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారుు. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 4-0తో కోస్టారికాపై... మహిళల జట్టు 3-1తో బ్రెజిల్‌పై గెలుపొందారుు. పురుషుల విభాగం గేముల్లో ఆధిబన్ 48 ఎత్తుల్లో సెర్గియో పినెడాపై, విదిత్ సంతోష్ గుజరాతి 32 ఎత్తుల్లో బెర్నాల్ గొంజాలెజ్‌పై, సేతురామన్ 40 ఎత్తుల్లో లియోనార్డో రొమెరోపై, మురళీ కార్తికేయన్ 45 ఎత్తుల్లో అలెక్సిస్ మురిలోపై నెగ్గారు. మహిళల విభాగం గేముల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 74 ఎత్తుల్లో జూలియానా సయూమి చేతిలో ఓడిపోగా... తానియా సచ్‌దేవ్ 35 ఎత్తుల్లో జూలియా అల్బోరెడోపై, సౌమ్య స్వామినాథన్ 34 ఎత్తుల్లో సుజానా చాంగ్‌పై, తెలుగు అమ్మారుు బొడ్డ ప్రత్యూష 23 ఎత్తుల్లో క్యాథీ గులార్ట్‌పై విజయం సాధించారు.